చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మృతి.
ఎస్.రాయవరం. అఖండ భూమి వెబ్ న్యూస్ :
ఎస్.రాయవరం మండలం తీర ప్రాంతమైన బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు మైలపల్లి సోమేష్ చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చేపల వేట ప్రధాన వృత్తిగల మైలపల్లి సోమేష్ ఆదివారం తెల్లవారుజామున తన సహచరులు నలుగురితో కలిసి చేపల వేటకు వెళ్లగా సముద్రంలో చేపలకై వల వేస్తున్న సమయంలో అలల ఉదృతి పెరగడంతో బోటు ముందుభాగంలో తూలి పడడంతో బోటు ముందు ఉన్న కర్ర అతని చాతీకి బలంగా తగిలి ముందుకు పడిపోవడంతో ఎడమ పక్క కనురెప్ప వద్ద గాయం అయ్యింది. ఇది గమనించిన సహచర మత్స్యకారులు దగ్గరికి వెళ్లి తట్టి లేపగా స్పృహలో లేని సోమేష్ ను అదే బోటులో ఒడ్డుకు చేర్చి కారులో హుటాహుటిన ఉదయం 6 గం సమయంలో నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



