వికలాంగులకు ట్రై వీలర్ స్కూటీల పంపిణీ
ఎస్.రాయవరం. అఖండ భూమి వెబ్ న్యూస్ :
మండలంలోని కొరుప్రోలు క్యాంపు కార్యాలయంలో ఆదివారం నాడు పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు చేతుల మీదుగా వికలాంగులకు ట్రై వీలర్ స్కూటీలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు , వృద్దులు, వికలాంగులకు అనేక సంక్షేమ పధకాల ద్వారా లబ్ది చేకూరిస్తున్నారని, వికలాంగులు తమ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ఒకరిపై ఆధారపడకుండా జీవనోపాధి పొందెందుకు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ప్రయాణించేందుకు ఈ ట్రై వీలర్ స్కూటీలు ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ కాకర దేవి,కొరుప్రోలు ఎంపిటిసి వెంకట లక్ష్మీ, పార్టీ సీనియర్ నాయకులు పోలిశెట్టి పెద ఈశ్వరరావు, కొణతాల శ్రీనివాస్, తిమ్మాపురం సర్పంచ్ కర్రి సత్యన్నారాయణ, మాజీ సర్పంచ్ పుట్టా సుధాకర్,వికలాంగుల అభివృద్ధి సంస్థ ప్రతినిధులు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.



