సర్పంచులందరు ఏకం కావాలి.
రాష్ట్ర పంచాయతీ రాజ్ ఉపాధ్యక్షులు వినోద్ రాజు
ఎస్.రాయవరం.
గ్రామ పంచాయతీలలో గల నిధులను స్వాహా చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ గ్రామ సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా నిలుపుతున్న వైకాపా ప్రభుత్వ చర్యలకు నిరసనగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ను కలిసి 15 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసే కార్యక్రమానికి పార్టీలకతీతంగా సర్పంచులు అందరూ ఏకం కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ ఉపాధ్యక్షులు యేజర్ల వినోద్ రాజు పిలుపునిచ్చారు. ఆదివారం నాడు తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ నాలుగేళ్ళ వైకాపా ప్రభుత్వ పరిపాలనలో సుమారు 15 వేల కోట్ల రూపాయల పంచాయతీ నిధులను దారి మళ్ళించి పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసారని, గ్రామ సర్పంచుల హక్కులను అధికారాలను కాపాడుకోకుంటే భవిష్యత్తులో పంచాయతీ అనే వ్యవస్తే రూపుమానుతుందని, కాబట్టి సోమవారం నాడు అనకాపల్లి జిల్లా కలెక్టర్కు తమ సమస్యలపై వినతిపత్రం అందజేసే కార్యక్రమానికి సర్పంచులు ప్రతీ ఒక్కరు తరలి రావాలని పిలుపునిచ్చారు.



