జగన్మోహన్ రెడ్డి గెలుపే మా జయం మాజీ మంత్రి తోట నరసింహం
కాకినాడ జిల్లా జగ్గంపేట జూలై 23: అఖండ భూమి జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో వరుపుల సూరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తోట నరసింహం పాల్గొన్నారు కాండ్రేగుల ప్రజలు ఘన స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు అనంతరం సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమావేశం ఒక పార్టీ సమావేశం కాదు నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను పలకరించిన ఆత్మీయులను కలుసుకోవడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా జగ్గంపేట నియోజకవర్గం ప్రజలకు సేవ చేశాను అలాగే రాజశేఖర్ రెడ్డి మరణ అనంతరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డితో ఓదార్పు యాత్రలో పాల్గొనడం జరిగిందన్నారు అందులో భాగంగానే 2019లో పెద్దాపురం నియోజవర్గం నుంచి నా సతీమణి వాణి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగిందన్నారు జగ్గంపేట నియోజకవర్గం నా కార్యకర్తలను ఆనాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న చంటిబాబు కు సపోర్ట్ చేయడం జరిగింది అన్నారు అందువల్ల ఎమ్మెల్యే గా చంటిబాబు ఘనవిజయం సాధించారన్నారు జగ్గంపేట నియోజవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ముఖ్యంగా ఈ కాండ్రేగులు పట్టం భావారం చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి సమస్య తీర్చేందుకు కోట్లాది రూపాయలు హెచ్చించి ఫిల్టర్ వాటర్ తేవడం జరిగింది అన్నారు అలాగే ఎన్నో ఏళ్లగా సమస్యాత్మగా ఉన్న అగ్నిమాపక కేంద్రని తేవడం జరిగింది అన్నారు పుష్కర ఎత్తిపోతల పథకం తోట వెంకటచలం పేరు పెట్టడానికి ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారి కానీ క్యాబినెట్ మంత్రి వర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ అంగీకరించడం నాకెంతో సంతోషంగా ఉందన్నారు రాబోయే 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడమే నా జయంగా ఈ ఆత్మీయ సమావేశం లో జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో అత్తులూరి సాయిబాబు ,ఎస్.కె గపూర్ , తుల్ల రాము, గొల్ల ఏడుకొండలు ,ఓలేటి రాజు ,రామకుర్తి మూర్తి, పలికిల గంగరాజు, బచ్చల సుబ్రమణ్యం,వీరబాబు రాజా రాజేష్ తదితరులు పాల్గొన్నారు



