హైదరాబాద్ (అఖండ భూమి) బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా సచివాలయ నిర్మాణం చేపట్టారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని తెలిపారు. సచివాలయంలో హిందువుల వాటా రెండు గుంటలేనని.. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన కొత్త సచివాలయంలోకి తాము అడుగుపెట్టమని తేల్చి చెప్పారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనం ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ఉదయం 4నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. వీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వరకు ఇరువైపుల అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. ఆహ్వానితుల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించామని, సచివాలయానికి వచ్చే ఆహ్వానితులు తమ పాస్‌లను కార్ డోర్లకు అతికించుకోవాలని సూచించారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



