రౌతులపూడిలో పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ ప్రారంభించిన ఏలూరు రేంజ్ డిఐజి.
కాకినాడ జిల్లా రౌతులపూడి అఖండ భూమి వెబ్ న్యూస్ :
రౌతులపూడి. మండల ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా పోలీస్ స్టేషన్ ఆదివారం మండల కేంద్రమైన రౌతులపూడిలో ఏలూరు డిఐజి జి వి జి అశోక్ కుమార్ (ఐ పి ఎస్.) కాకినాడ జిల్లా పోలీస్ అధికారి ఎస్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ మరియు ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న గ్రామపంచాయతీ భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఈరోజు రౌతులపూడిలో ప్రారంభించిన ఈ పోలీస్ అవుటు పోస్ట్ పోలీస్ స్టేషన్ గా అన్ని వసతులు సావుకూర్చేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు పర్వత మాట్లాడుతూ ప్రజల మాన ధన ప్రాణ రక్షణకు రక్షణ కల్పించే వ్యవస్థ పోలీస్ వ్యవస్థన్నారు. అనంతరం పార్లమెంటు సభ్యురాలు వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ భారతదేశంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ ప్రజల కొరకు పగలు రాత్రులు తమ ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం కృషిచేసి రక్షణ కల్పించేది పోలీస్ వ్యవస్థేనని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషివల్లే ఇక్కడ పోలీస్ స్టేషన్ మంజూరు అయిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు గీతా విశ్వనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీసు ప్రజలు స్నేహితులుగా కొనసాగాలని న్యాయ పరిరక్షణ కొరకు నిరంతరం శ్రమిస్తామన్నారు. మా సిబ్బంది ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని 15 మంది సిబ్బందితో అవుట్ పోస్టును ప్రారంభించడం జరిగిందన్నారు. అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ జి ప్రేమ కాజల్, కె కిషోర్ బాబు, రౌతులపూడి ఎస్. ఐ., ఎం డి.అబ్దుల్ నభి, జెడ్ పి టి సి సభ్యులు గొల్లు లక్ష్మణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ జిగిరెడ్డి రమణమ్మ, రౌతులపూడి సర్పంచ్ కటారి అర్జమ్మ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజలు పాల్గొన్నారు


