తెలంగాణ నూతన సచివాలయంలో ప్రారంభమైన పూజలు..
హైదరాబాద్ ఏప్రిల్ 30 (అఖండ భూమి) :
తెలంగాణకే తలమానికంగా మారిన నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేటి మధ్యాహ్నం 1.20-1.32 మధ్య ప్రారంభించనున్నారు..
ఆ తర్వాత 1.56-2.04 గంటల మధ్య మంత్రులు, అధికారులు ఒకేసారి తమ సీట్లలో ఆసీనులవుతారు. 2.15 గంటలకు బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. నూతన సచివాలయంలో ఈ తెల్లవారుజామున 5.50 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 6.15 గంటలకు ప్రారంభమైన చండీయాగం, సుదర్శన యాగాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం జరగనున్న వాస్తు పూజలోనూ వారు పాల్గొంటారు. హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్లలో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్గొంటారు. శృంగేరీ పీఠానికి చెందిన గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ, వాస్తు పండితుడు సుద్దాల సుధాకర తేజ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు..
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



