హైదరాబాద్-విజయవాడ హైవేపై వరద.. భారీగా నిలిచిపోయిన వాహనాలు
నందిగామ: హైదరాబాద్-
విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే..శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్‌గేట్ నుంచి విజయవాడ వైపు సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి..



