మహోగ్ర రూపం దాల్చిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాద్రి కొత్తగూడెం : గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు దాటేసింది..
భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలం రాయన్న పేట వద్ద.. నేషనల్ హైవే పై వరద నీరు పోటెత్తింది. భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిషా ఛత్తీస్ గడ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ములుగులో కూడా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది..



