కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో వైసిపి నాయకులు మట్టిని అక్రమంగా తరలించడంపై ఆ గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలోని చెరువులోని మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని అదేవిధంగా తాండవ నదిలోని ఇసుకను సైతం అక్రమంగా తరలిస్తూ కాసులు వెనకేసుకుంటున్నారని ఆయన అన్నారు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్న రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని బుల్లిబాబు అన్నారు ఇలాంటి దుశ్చర్యలతో గ్రామ ప్రజలందరూ విసిగిపోయారని ఆయన అన్నారు అంతేకాకుండా జగనన్న కాలనీల స్థలాల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగినా రెవెన్యూఅధికారులు కనీసం అటువైపుచూడకపోవడం పలుఅనుమానాలకు తావిస్తుందన్నారు అర్హులకి స్థలాలు కేటాయించకుండా అనర్హులకు ఒక్కొక్కరికి నాలుగు సెంట్లు చొప్పున అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు దీనిపై రెవెన్యూ అధికారులు పూర్తి విచారణజరపాలని ఆయన అధికారులనుకోరారు లేదంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని ఆయన అన్నారు

ANDHRA NEWS PAPER POLITICS

