అల్లూరి జిల్లా సీలేరులో వైజాగ్ అపోలో హాస్పిటల్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి సీలేరు (అఖండ భూమి) అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరులో ఈరోజు స్థానిక రామాలయం వద్ద అపోలో హాస్పిటల్ (వైజాగ్) డాక్టర్ అసోసియేషన్ అధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి 315 మందికి వైద్యసేవలు అందించారు. బ్లడ్ ప్రెషర్ (బిపి), జ్వరం సంబంధించిన పరిక్షలు, డయాబిటిస్ పరిక్షలు చేసి, (చిరు వ్యాధులు) జలుబు, దగ్గు,గజ్జి, తామర వున్న వాళ్లకు మందులు మందులు ఇచ్చి, ప్రతి రోజు స్నానం చేయాలి.

ఉతికిన బట్టలు వేసుకోవాలి, కాళ్ళు, చేతులు, గోళ్ళు, పొట్టిగా కత్తిరించి కోవాలి. ముఖ్యంగా వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలి, ప్రతి రోజు వేడి వేడి నీళ్లు తాగాలని అపోలో హాస్పిటల్ డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఈ కార్య క్రమం లో డా.రాజేష్ వెంకట్(న్యూరో ఫీజిషన్), డా.రవివర్మ(రేడియోలజి), డా.గణేష్(వ్యస్కల్ సర్జన్), డా.హేమంత్ నాగ వర్మ (అంకలజిస్ట్ సర్జన్), వి.శ్రీనివాస్ (గేస్త్రోఎంట్రాలజిస్ట్), డా.రాజ్(అర్టో పెడిట్), డా.ఎస్.ఖాదర్ మస్తాన్ వలీ, డా. కె.సౌమ్యా, డా.రవి(ఎమర్జెన్సీ మెడిసిన్), డా.అనిల్ (ఫిజియోతెరపి), డా.నాగేంద్ర (ఫిజియోథెరపీ), ఎన్.త్రినాధ్ (హెల్త్ సూపర్వైజర్), ఎం.వరలక్ష్మి , సి హెచ్ ఓ ఎన్.వనజాక్షి పాల్గొన్నారు.


