రెండు రోజుల్లో అందరికీ టార్పాలిన్స్ ఇస్తాం,

 

రెండు రోజుల్లో అందరికీ టార్పాలిన్స్ ఇస్తాం, కిరోసిన్,మంచి నూనె ఇతర నిత్యవసరాలన్నీ పంపిణీ చేస్తాం  సిపిఎం బృందానికి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హామీ

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి చింతూరు (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు డివిజన్లోని విలీన నాలుగు మండలాల్లో వరద ముంపు గురైనటువంటి గ్రామాల్లోని నిర్వాసితులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు మెరుగుపరిచి, బియ్యం మంచి నూనెతో సహా 16 రకాల నిత్యవసర సరుకులు అన్ని ఇవ్వాలని, టార్పాలిన్సు పంపిణీ చేయాలని, మంచినీరు అందించాలని, కుటుంబానికి రెండు దోమతెరలు ఇవ్వాలని, కిరోసిన్ కొవ్వొత్తులు ఇవ్వాలని, వరద చుట్టుముట్టిన గ్రామాలన్నిటి కూడా ప్రభుత్వ సహాయం అందించాలని, ప్రతి కుటుంబానికి ఒక టార్చి లైట్ ఇవ్వాలని, సామాన్లు తరలించుకోవడానికి రవాణా సౌకర్యం నిమిత్తం కుటుంబానికి 5000 ఇవ్వాలని, హాస్పిటల్స్ కి తరలించిన గర్భిణీ స్త్రీలకు పాలు గుడ్డుతో సహా పౌష్టికాహారం అందించాలని, వరద తగ్గుతున్నందున అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, పాము కాటు కుక్కకాటు నివారణ మందులు అందుబాటులో ఉంచాలని తదితర డిమాండ్స్ పరిష్కారం

చేయాలనీ సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో అందరికీ తార్పాలిన్సు అన్ని రకాల నిత్యవసర సరుకులు ఇస్తామని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి దోమతెరలు అందిస్తామని, కిరోసిన్ మంచినీరు ఇస్తామని హామీ ఇచ్చారు.కలెక్టర్ ని కలిసిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకట్, మండల కార్యదర్శి సీసం సురేష్, ఎర్రం శెట్టి శ్రీనివాస్, పోడియం లక్ష్మణ్, కారం సుబ్బారావు వున్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!