ఇంటర్న్ షిప్పులతో ఉజ్వల భవిష్యత్తు…

 

ఇంటర్న్ షిప్పులతో ఉజ్వల భవిష్యత్తు

విశాఖపట్నం అఖండ భూమి….i

ఇంటర్న్ షిప్పులలో విద్యార్ధినులు భాగం పంచుకోవడం వల్ల వారికి వాస్తవిక విషయాల పట్ల అవగాహన ఏర్పడిందని, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయని సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ప్రేమ కుమారి అన్నారు. స్థానిక సెయింట్ ఆన్స్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థినుల ఇంటర్నెట్ షిప్ మూల్యాంకన ముగింపు సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ- ప్రతి ఒక్కరు ఇంటర్న్ షిప్పులలో భాగం పంచుకోవడం ఆనందదాయకం అని అన్నారు. ఇంటర్న్ షిప్పులకు అవకాశం ఇచ్చిన హెచ్.పి. సి.ఎల్., కోరమాండల్, స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్ తదితర పరిశ్రమలకు, టెక్ మహీంద్రా, అనుదీప్, వి.జె. ఇన్ఫో వంటి ఐటి సంస్థలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల ఇంటర్న్ షిప్పుల ఇంచార్జ్ వై. అనసూయదేవి మాట్లాడుతూ- 90 రోజులపాటు డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థినులు ఇంటర్న్ షిప్ ను చేయడం ఎంతో ఆనంద దాయకం అని, దీనివల్ల వారిలో నైపుణ్యాలు పెరిగాయని, దాదాపు 3 వంతుల మందికి ఇంటర్న్ షిప్ అవ్వగానే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. సమావేశంలో ఇంటర్న్ షిప్పుల మెంటార్లు,విద్యార్ధినులు మరియు యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటర్న్ షిప్ లలో పాల్గొన్న విద్యార్థినులకు గ్రేడ్స్ ను, మెంటార్లకు ప్రశంసా పత్రాలను అందించి ప్రిన్సిపాల్ అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!