ఘనంగా బోనాల పండుగ కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో
బాచుపల్లిలో బోనాల ఉత్సవాలు
పార్టీలకు అతీతంగా హాజరైన నియోజవర్గ నాయకులు
కుత్బుల్లాపూర్ జూలై 30 అఖండ భూమి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో ఆదివారము నాడు బోనాల పండుగ ఉత్సవాల సందర్బంగా కుటుంబ సభ్యులతో కార్యకర్తలతో కలిసి కోలన్ హనుమంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కొలన్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని,వారిని సుఖశాంతులతో, సిరి సంపదలతో ఉండేలా దీవించాలని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు,స్థానిక డివిజన్ వాసులు,బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు. .



