గోదావరి వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని పరిహారం అందించాలి

 

గోదావరి వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని పరిహారం అందించాలి

– వరద బాధితులకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి

– బి. అయోధ్యసి పిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

భద్రాద్రి కొత్తగూడెం, ప్రతినిధి జూలై 30 (అఖండభూమి) పినపాక నియోజకవర్గ గోదావరి వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని వారికి కుటుంబానికి 25000 రూపాయలు చొప్పున పరిహారం అందించాలని, వారికి శాశ్వత పరిష్కారం చూపాలని,వరదలు వచ్చినప్పుడు ఇలా ఇండ్లు వరదలు పట్టడం మునిగిపోయే విధంగా ఉన్నాయని అలా కాకుండా అధికారులు వీరికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం సిపిఐ మండల టౌన్ పార్టీ ఆధ్వర్యంలో గోదావరి పునరావాస కేంద్రాలను వారు సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభమైందని డెంగ్యూ మలేరియా ,జ్వరాలు రాకుండా జాగ్రత్తలు చేపట్టాలని ,కేంద్రాల్లో మెడికల్ క్యాంపు ఉన్నటువంటి వారికి నిర్వాహకులకు జాగ్రత్తలు చేపట్టాలని వారు క్యాంపు నిర్వహించిన వారికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా చినరాయగూడెం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తిగా కురుస్తున్నాయని , పెచ్చలూడి ఎప్పుడు మీద పడతాయో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నామని. దీనికి తోడు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి పెరిగినప్పుడల్లా ఒకవైపు డబల్ బెడ్ రూమ్ లు కురుస్తూ ఉండడం మరోవైపు గోదావరి పెరిగి ఇండ్లు ముంపుకు గురి కావడం పరిపాటిగా మారిందని దీనివలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చిన్నపిల్లల్ని వేసుకొని నిద్ర ఆగారాలు మాని అనేక బాధలు పడుతున్నామని… మాకు శాశ్వత పరిష్కారం ప్రభుత్వం చూపించాలని, కొత్త డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని దీనికోసం అధికారులతో మాట్లాడాలని అయోధ్యకు వారు గోడు విన్నవించారు.

కమలాపురం గ్రామం ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారంకు అధికారులు చర్యలు చేపట్టాలని, వరదలు తీవ్ర స్థాయిలో వచ్చినప్పుడు ఈ పరిస్థితి నెలకొంటుందని, మామిడితోట చాపల మార్కెట్,అశోక్ నగర్ (పోలీస్ కాలనీ) , సమితి సింగారం రైల్వే గేట్ లైన్ రైల్వే బ్రిడ్జి దగ్గర వరద బారిన పడకుండా అధికారులు శాశ్వత పరిష్కారం చూడాలని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వారి డిమాండ్ చేశారు.

మాకు శాశ్వత పరిష్కారం చేయని పక్షంలో ఇకడ నుంచి వెళ్ళేది లేదని ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అధికారులు,ప్రజాప్రతినిధులు ఇలాగే చెప్పి వెళ్ళిపోతున్నారని మా బాధలు వర్ణాతీతం అని శాశ్వత పరిష్కారం చేయకపోతే ఇక్కడ నుండి కదిలి లేదని వారు అయోధ్యకు వివరించారు.ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్న లక్ష్మీకుమారి, పట్టణ కార్యదర్శి దుర్గాల సుధాకర్,సిపిఐ జిల్లా సమితి సభ్యులు అక్కి నరసింహారావు ఎస్ కే సర్వర్,సోందే కుటుంబరావు సర్పంచ్ బాడీషా సతీష్ నాయకులు మంగి వీరయ్య,ఎస్టి ఉమర్ ఏఐటియుసి మణుగూరు బ్రాంచ్ ఉపాధ్యక్షులు బి వీరస్వామి,సహాయ కార్యదర్శి ఎస్ వి నాయుడు ఏఐటీయూసీ మండల అధ్యక్షులు తోట రమేష్,ఎంపీటీసీ పాయం లక్ష్మయ్య,వార్డు మెంబర్లు, కడితి సత్యనారాయణ వజ్జ వెంకటేశ్వర్లు , కన్నెబోయిన ప్రసాద్ చింతల రాజు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!