పునరావాస కేంద్రాలను  సందర్శించిన బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత 

 

పునరావాస కేంద్రాలను  సందర్శించిన బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

భూర్గంపహాడ్ జూలై 30 (అఖండ భూమి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపహాడ్ మండలంలోని రెడ్డిపాలెం ప్రభుత్వ పాఠశాల మరియు బూర్గంపహాడ్ కస్తూరిబా పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను  సందర్శించి  వరద బాదితులకు దగ్గరుండి ప్రజలకు భోజనాలు వడించి,వారితో కలిసి భోజనం రుచి చూసారు. అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి యోగ క్షేమలు అడిగి తెలుసుకొని దైర్యం చెప్పారు.నీటి ఉదృతి తగ్గుముకం అవుతుంది కాబట్టి అందరు దైర్యంగా ఉండాలని చెప్పినారు. ప్రజలందరు వారి నివాసలకు వెళ్లెవరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు,అంటూ వ్యాధులు, జ్వరాలు రాకుండా  నీట మునిగిన ప్రాంతాలలో తగు  జాగ్రత్త లు తీసుకోవాలని చెప్పారు, ప్రతి క్షణం ప్రజలకు తోడుగా ఉంటాము అందరం క్షేమంగా వారి నివాసలకు చేరుకోవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత గారు, వారితో పాటు స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు,మండల నాయకులు, యూత్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!