మణిపూరులో జరిగిన హింసత్మక సంఘటనలకు నిరసనగా పాస్టర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

 

 

మణిపూరులో జరిగిన హింసత్మక సంఘటనలకు నిరసనగా పాస్టర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

టిడిపి వైసిపి నాయకుల మద్దతు

భారీ స్థాయిలో తరలివచ్చిన క్రైస్తవులు

అల్లూరి జిల్లా గూడె కొత్తవీధి, అఖండ భూమి జూలై 31:- మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలకు నిరసనగా సోమవారం గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో జీకే వీధి పాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు, క్రైస్తవులు, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.చైతన్య స్రవంతి కాలనీ నుండి పెట్రోల్ బంక్ వరకు భారీ జనాంగంతో ర్యాలీ నిర్వహించారు.అనంతరం జీకే వీధి కూడలి వద్ద మణిపూర్ సంఘటన బాద్యులను కఠినంగా శిక్షించాలి.క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి.మణిపూర్ లో గిరిజనులకు న్యాయం చేయాలి అని నినాదాలు చేశారు. అనంతరం పలువురు పాస్టర్లు ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. పాస్టర్ డేవిడ్ రాజు మాట్లాడుతూ బిజెపి పార్టీ వల్లనే మణిపూర్లో అల్లర్లు జరిగాయని,ఈ పార్టీ వల్ల క్రైస్తవులకు తీరని అన్యాయం జరుగుతుందని,గిరిజనులను హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బిజెపి నాయకుల వల్ల ప్రపంచ క్రైస్తవులకు దేశంలో క్రైస్తవులకు,గిరిజనులకు తీవ్ర మనోవేదన మిగిల్చారని అన్నారు.ప్రధానమంత్రి మణిపూర్ ముఖ్యమంత్రి ప్రజలను పరిపాలించడంలో విఫలమయ్యారని అన్నారు. మణిపూర్ లో నష్టపోయిన గిరిజనులకు న్యాయం చేయాలని, గిరిజనులకు క్రైస్తవులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.శాంతి సాధన పాఠశాల కరస్పాండెంట్ ఫాదర హ్యారి పీటర్ మాట్లాడుతూ మనమంతా భారతీయులమని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని కులాలు మతాలు పక్కనపెట్టి సహోదర ప్రేమను కలిగి ఉండాలని అన్నారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో కార్యాలయంలో మణిపూర్ బాధ్యులను శిక్షించాలని నష్టపోయిన గిరిజనులను రక్షించాలని కోరుతూ ఆర్ఐ కామేశ్వరరావుకు వినతి పత్రం అందించారు.అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు వసుపరి తిమోతి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 80 రోజులుగా మణిపూర్లో హింస చెలరేగుతున్న కేంద్ర ప్రభుత్వం చూచి చూడనట్లు వ్యవహరిస్తుందని, క్రైస్తవులను ఊచ కోత కోస్తున్నారని, క్రైస్తవులను రక్షించాలని,చర్చిలకు రక్షణ కల్పించాలని,హింసకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

ఈ కార్యక్రమంలో వైసిపి పార్టీకి సంబంధించి అల్లూరి జిల్లా వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్,జీకే విధి మార్కెట్ యార్డ్ చైర్మన్ వసుపరి ప్రసాద్, వైస్ ఎంపీపీ సప్ప గడ్డ ఆనంద్,జీకే విధి సర్పంచ్ కోర్ర సుభద్ర,వంచుల ఎంపిటిసి జోరంగి సరస్వతి,వైసిపి నాయకులు అరుణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ మాజీ జడ్పిటిసి గంట నలినీ కృష్ణ,మాజీ జిల్లా టిడిపి కార్యదర్శి ముక్కలి మహేష్ పాల్గొన్నారు.పాస్టర్లు వంతల పద్మాకర్ రావు,కోర్ర భూపతి,చల్లారావు పాస్టర్,వంతల జేమ్స్,పాస్టర్ రాజు వరరావు,పాతున డేవిడ్ రాజ్ పాస్టర్,వివిధ క్రైస్తవ సంఘాలకు సంబంధించిన క్రైస్తవులు,సానుభూతిపరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!