జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 147వ జయంతి వేడుకలు.

 

శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో స్వాతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 147వ జయంతి వేడుకలు.

శ్రీకాకుళం ఆగస్టు 02. అఖండ భూమి వెబ్ న్యూస్ :

శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కార్యదర్శి గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 147వ జయంతి వేడుకలు. ఘనంగా జరిగాయి. తొలుత పింగళి వెంకయ్య గారి చిత్రపటానికి కార్యదర్శి శ్రీ బి. కుమార్ రాజు గారు, ఉప గ్రంథాలయాధికారి వి.వి.జి.యస్. శంకరరావు గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యదర్శి శ్రీ బి. కుమార్ రాజు గారు మాట్లాడుతూ పింగళి వెంకయ్య గారు 1876 సంవత్సరంలో మచిలీపట్నంలోని భట్ల పెనుమర్రు గ్రామంలో హనుమంత రాయుడు మరియు వెంకటరత్నం అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారని చెప్పారు.

1921 వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో గాంధీజీ వెంకయ్యను జాతీయ పతాకం తయారు చేయమని అడిగినప్పుడు కేవలం మూడు గంటల్లో తయారు చేశారని చెప్పారు. పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయ ఉద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నారని చెప్పారు. వందేమాతరం, హోమ్ రూల్ ఉద్యమం, ఆంధ్రోద్య మం లాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రధాన పాత్రగా ఉన్నారని చెప్పారు.

ఈయన భారతదేశ జాతీయ పతాక రూపకర్త అని చెప్పారు. 1916 లో “భారతదేశానికి ఒక జాతీయ పతాకం “అనే ఆంగ్ల గ్రంధాన్ని రచించారు అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కె.చిరంజీవులు, యు.కల్యాణి, ప్రత్యూష, పి.రామమోహన్, పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!