అల్లూరి జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తీసుకువెళ్లడం అభినందనీయం జడ్పిటిసి పోతురాజు బాలయ్య
అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి చింతపల్లి (అఖండ భూమి) అల్లూరి జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన జిల్లా వైసీపీ అధ్యక్షురాలు పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి కి చింతపల్లి వైసిపి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చింతపల్లి వైసిపి జడ్పిటిసి పోతురాజు బాలయ్య అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలోని వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చిన సందర్భంగా అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక క్లిష్ట సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి ప్రత్యేకంగా తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిందిగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కోరడం దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి స్పందించడం అభినందనీయమన్నారు అల్లూరి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చొరవతోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం అమలు జరుగుతున్నాయని జిల్లాకు గర్వకారణంగా జిల్లా ఆసుపత్రి నిర్మాణం అలాగే చింతపల్లిలో 100 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం వంటి పనులనే కాకుండా ఇంకా మరిన్ని పరిష్కారం కాని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాల్సిందిగా కోరడం పట్ల జడ్పిటిసి పోతురాజు బాలయ్య నియోజకవర్గంపై భాగ్యలక్ష్మి కి ఉన్న దీక్ష పట్టుదలకు నిదర్శనం అన్నారు ఇప్పటికే నియోజకవర్గంలో రహదారులు నాడు నేడు ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్న తరుణంలో ప్రజలు సరైన నీటి సౌకర్యం లేక పంటలు పండించలేకపోతున్నారంటూ చెక్ డాముల నిర్మాణానికి గత టిడిపి ప్రభుత్వంలో అద్దాంతరంగా ఆగిపోయిన గృహ నిర్మాణాలకు నిధులు కేటాయించాలంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కోరడం దానిని సీఎం సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి హామీ ఇవ్వడం పట్ల గిరిజన ప్రాంత రైతాంగం పట్ల భాగ్యలక్ష్మి కి ఉన్న మక్కువ తెలియజేస్తుందని జడ్పిటిసి పోతురాజు బాలయ్య పేర్కొన్నారు ముఖ్యంగా చింతపల్లి ప్రాంత గిరిజన రైతుల చిరకాల వాంఛ అయిన తాజంకి పంచాయతీ తాజ్జంగి కొమ్మంగి పంచాయతీ పరిధిలో రిజర్వాయర్ల నిర్మాణం గురించి పెద్ద బరడ పంచాయతీ పులుగుంది రిజర్వాయర్ నిర్మాణాల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం అభినందనీయమన్నారు ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిరంతరం గడపగడపకి మన ప్రభుత్వం కింద ప్రతి గడప ప్రతి పల్లె తిరిగి సమస్యలు తెలుసుకుని వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం నిజంగా అభినందనీయమని చింతపల్లి జడ్పిటిసి పోతురాజు బాలయ్య తెలిపారు


