ఆకలితో అలమటించే వారికి కొండంత అండ.. చౌల్ ప్రభాస్

 

ఆకలితో అలమటించే వారికి కొండంత అండ.. చౌల్ ప్రభాస్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రతినిధి ఆగస్టు 02 అఖండ భూమి వెబ్ న్యూస్..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రం క్షత్రియ(పట్కరి) కులానికి చెందిన (40) సంవత్సరాలు నిండని మధ్యతరగతి కుటుంబానికి చెందిన మృదు స్వభావి చౌల్ ప్రభాస్ నిరుపేదలు. ఆకలితో అలమటించే వారిని యాచకులను చూసి మనసు ద్రవించి టాక్సీని నడుపుకుంటూ సేవ్ లైఫ్ ఫౌండేషన్ ను స్థాపించి సొంత డబ్బుతో ప్రతిరోజు 100 మందికి స్నేహితులతో కలిసి అన్నమో రామచంద్ర అనే వారి ఆకలని తీర్చి. ఫుట్ పాత్ లపై నిద్రపోయే నిత్య కూలీలకు దుప్పట్లను పంపిణీ చేస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జక్రాన్ పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్ రాజకీయ నాయకులతో సన్మానాలు మెప్పు పొంది ఆకలి తీర్చిన వారి ఆశీర్వాదాలు పొందుతూ వారి కంట్లో ఆనందాన్ని చూస్తూ తను ఆనందాన్ని పొందుతున్నాడు.

తండ్రి దేవిదాస్ ఇంట్లోనే ఉంటూ ప్రైవేట్ పెట్రోల్ బంకులు. వైన్స్ షాపులు. కిరాణా దుకాణాల ప్రైవేట్ అకౌంట్స్ చూస్తూ ఉంటాడు. తల్లి నాగవేణి బీడీలు చేస్తుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ముగ్గురు కొడుకులు ఉండగా ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. పెద్ద కుమారుడు గంగా శ్రీనివాస్ వైన్స్ షాపులో పనిచేస్తున్నాడు. నడిపి కొడుకు దేవేందర్ మెదడులో రక్తం గడ్డకట్టి చనిపోయాడు. చిన్నవాడైన చౌల్ ప్రభాస్ స్వతహాగా తెలివిపరుడు తల్లితండ్రులను చూసుకుంటూ టాక్సీని నడుపుకుంటూ ఇద్దరు అక్కల పెళ్లిళ్లకు తండ్రికి తన వంతు ఆర్థిక సహాయం చేయడంతో పెళ్లిళ్లు అయ్యాయి. ఏదైనా ఆశించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారా లేదా రాజకీయాలలోకి రావాలని ఆశిస్తున్నారా అని అఖండ భూమి ప్రతినిధి ప్రభాస్ తో ముచ్చటించగా ఆకలితో ఉన్నవారి బాధలను. ఫుట్పాతులపై నిద్రించే రోజువారి కూలీలు అవస్థలు చూసి చలించి వారికి ఏదైనా చేయాలని తపనతో స్నేహితులతో కలిసి సేవ్ లైఫ్ ఫౌండేషన్ను స్థాపించడం జరిగిందన్నారు. రాజకీయాలలోకి రావాలని ఉద్దేశం అసలే లేదన్నారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా పని చేస్తున్నానని కేవలం సమాజసేవ కోసం పనిచేస్తానన్నారు.

దయచేసి ఎవ్వరు కూడా రాజకీయంలో రావడం కోసం చేస్తున్నాడని భావించవద్దని విజ్ఞప్తి చేశారు. వినాయక చవితికి భక్తులకు నవరాత్రులు అన్నదాన ప్రసాదాన్ని అందించాలనీ తపిస్తున్న నన్నారు. నేను చేస్తున్న సేవ కార్యక్రమాలకు సహకరించాలనుకునే దాతలు 8341321438 సెల్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి చెప్పాలని ప్రభాస్ కోరారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్కు సహకరిస్తున్న స్నేహితులకు. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!