జర్నలిస్టు లు రాష్ట్రంలో ప్రజలే వారు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వమే పరిష్కారం చూపాలి ఇదే తమ ప్రధాన ఎజెండా
అల్లూరిసీతారామరాజు జిల్లా డి జే ఎఫ్ అధ్యక్షుడు బత్తుల తారక రాజు.
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల మీడియా రంగాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలు తో పాటు హెల్త్ కార్డులు రవాణా సౌకర్యం వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో కాలేజీలలో ఫీజు రాయితీ మంజూరు చేయాలని డెమొక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ అల్లూరిసీతారామరాజు జిల్లా ప్రెసిడెంట్ బత్తుల రాజు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన స్థానిక విలేకరితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా మనుషులేనని ప్రజలకు ఎలా అయితే ప్రభుత్వం సేవలు అందిస్తుందో అదే విధంగా జర్నలిస్టులకు కూడా ప్రభుత్వపరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు
ఎంతో మంది ఈ రంగంలోకి వచ్చినప్పటికీ వారికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అలాగే జర్నలిస్టుల కు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ నీ కేటాయించాలని చిన్న పత్రిక పెద్ద పత్రిక యూట్యూబ్ ఛానల్ అనే తామరయం లేకుండా నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం శ్రద్ధ చూపాలని తెలిపారు. సమాజానికి సేవ చేసే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు.
జర్నలిస్టు వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న అనేకమంది కి ఇళ్ల స్థలాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై ఏ యూనియన్ తో అయినా సరే కలిసి పనిచేయటానికి డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని అల్లూరిసీతారామరాజు జిల్లా అధ్యక్షులు తెలిపారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



