డొంకరాయిలో విద్యుత్తు ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన తెలుగుదేశం పార్టీ

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి/ డొంకరాయి (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లా డొంకరాయి ఏపీ జెన్కో పవర్ ప్రాజెక్టు వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కి తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలిపింది ఈ మేరకు ఆ పార్టీ ఎంపీటీసీ కరక వెంకటరమణ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సమాచారం అందిస్తే ఎటువంటి పరిష్కారం చూపకుండా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుండడం వలన విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారని ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు డొంకరాయి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు తమ తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో సంఘీభావం తెలియజేస్తుందని ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని దానిని విస్మరించడం అంటే ఉద్యోగులను అవమానించినట్లేనని ఎంపీటీసీ పేర్కొన్నారు ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్యోగులతో పాటు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


