విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్(ఎల్ ఐ)గా పని చేసిన టేకి వెంకట సుబ్బారావు సేవలు చిరస్మరణీయం.

 

విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్(ఎల్ ఐ)గా పని చేసిన టేకి వెంకట సుబ్బారావు సేవలు చిరస్మరణీయం.

ఆలమూరు (అఖండ భూమి):డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ట్రాన్స్కో రూరల్ లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన టేకి వెంకట సుబ్బారావు సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు అన్నారు.ట్రాన్స్కోలో సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన వెంకట సుబ్బారావు పదవీ విరమణ సందర్భంగా సోమవారం రాత్రి ఆలమూరు విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు,ఉద్యోగులు సుబ్బారావు దంపతులకు దుశ్శాలువాలు కప్పి,పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.ఎల్ ఐ వెంకట సుబ్బారావు అందరితోను ఎంతో మంచిగా మాట్లాడుతూ,సహనంగా సమాధానం చెప్పడంలోను,అందర్ని కలుపుకుని విధుల్లో ఎంతో మంచిగా ఏపిఈపిడిసిఎల్ సంస్థలో మంచి ఉద్యోగిగా పనిచేసిన సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.ఈయన శేష జీవితం ఆనందంగా గడపాలని,ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండెలా ఆయనకు భగవంతుడు చల్లని దీవెనలు ఇవ్వాలని పలువురు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఎల్ ఐ టేకి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ నా సర్వీసు కాలంలో నన్ను ఎంతగానో అభిమానించి ఆదరించిన,నాకు అన్ని వేళల సహయసహకారాలు అందించిన ఉన్నతాధికారులకు,తోటి ఉద్యోగులకు,సిబ్బంది అందరికి ధన్యవాదములు తెలియజేస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డిఈ విజయానంద,మండపేట ఏడిఈ టి.తిరుమల రావు,ఏఈ వై.లక్ష్మి,టౌన్ లైన్ ఇన్స్పెక్టర్ వి. సత్యనారాయణ,యూనియన్ నాయకులు,చొప్పెల్ల లైన్ మేన్ సిహెచ్,శ్రీనివాసు,చెముడులంక జూనియర్ లైన్ మేన్ ఎస్.ప్రసాద్,పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!