ఈ నెల 9 నుండి 17 వరకు నా భూమి నా దేశం వీరులకు వందనం నేలతల్లికి నమస్కారం

 

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి మండలంలో 9 నుండి 17 వరకు నా భూమి నా దేశం వీరులకు వందనం నేలతల్లికి నమస్కారం కార్యక్రమం అమలు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు

 

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 9 నుండి 17 వరకు జాతీయ ఉపాధి హామీ పథకం అమృత సరోవర్ కింద నా భూమి నా దేశం వీరులకు వందనం నేలతల్లికి నమస్కారం పోగ్రామ్ని అమలు చేయనున్నామని గూడెం కొత్తవీధి ఎంపీడీవో ఉమామహేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమం కింద అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలతో వారికి వందనాలు తెలుపుతూ వారి జ్ఞాపకార్థం ప్రతి గ్రామపంచాయతీ పరిధిలోని 70 మొక్కలను నాటి వాటికి ఆయా ప్రాంతాల స్వాతంత్ర సమరయోధుల పేర్లను పెట్టి వారికి జ్ఞాపికలు పెట్టడం జరుగుతుందని అమృత సరోవర్ కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని దీనికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేసి ఖర్చు చేయడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు ఈ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సీఈవో ఆదేశాలతో అమలు చేస్తున్నామని గ్రామపంచాయతీ కార్యదర్శులు అందరూ తప్పనిసరిగా తమ తమ గ్రామ పంచాయతీల పరిధిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఎంపీడీవో కోరారు ఈ మేరకు గూడెం కొత్త వీధి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శిలను ఉపాధి హామీ పథకం సిబ్బందిని సమావేశపరిచి కార్యక్రమం వివరాలను వారికి వివరించారు పతి గ్రామపంచాయతీ పరిధిలోని స్వాతంత్ర సమరయోధులు స్థానిక స్వాతంత్ర పోరాటయోధుల వివరాలను సేకరించి వారి జ్ఞాపికలను పెట్టి అక్కడి నుండి మట్టి తీసి దానిని అమృత సరోవర్ ప్రాజెక్టు కింద న్యూ ఢిల్లీ పంపించడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు ముఖ్యంగా స్థానిక ప్రజలలో ప్రత్యేకంగా దేశభక్తిని ప్రేరేపించడానికి వారిని ఉత్తేజ పరచడానికి రేపటి కోసం ఈరోజు చదివించి మనకు స్వేచ్ఛనిచ్చిన వారికి అమరవీరులకి రుణపడి ఉందాం అనే కార్యక్రమం అలాగే దేశం కోసం ఉన్నత త్యాగాలు చేసిన త్యాగ వీరులను స్మరిద్దాం సాహస వీరుడు పెంచిన మన దేశభక్తిని నింపుదాము అనే కార్యక్రమం చేయాలని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత సరోవర్ చెరువుల వద్ద ఈ శిలాఫలకాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని దీనికి తగిన నిధులు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేయడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ హాజరు అయ్యేవిధంగా చూడాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులపై ఉందని ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి విజయవంతం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బందితో పాటు పిఓపి అరడి పాపారావు గ్రామపంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరావు వెంకటరమణ బాలకృష్ణ అరుణ్ కుమార్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!