జలవనరులకు 2.35 శాతమే ఖర్చు చేస్తే ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమా?: చంద్రబాబు
అనంతపురం: రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం 2.35 శాతమే జలవనరులకు ఖర్చు చేస్తే ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమా?అని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించారు..
‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల (Anantapur irrigation projects) స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
హంద్రీనీవా, సుజల స్రవంతి ఫేస్ 2లో భాగమైన మారాల రిజర్వాయర్‌ను తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిందని చంద్రబాబు గుర్తుచేశారు. కాలువలు పూర్తి చేస్తానని ఇచ్చిన మాటను వైకాపా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు తెదేపా హయాంలో రూ.4,182 కోట్లు ఖర్చు చేస్తే.. వైకాపా ఖర్చు చేసింది కేవలం రూ.515 కోట్లు మాత్రమేనని విమర్శించారు..
గొల్లపల్లి రిజర్వాయర్ ఆయకట్ట యుద్ధ ప్రతిపాదికన నిర్మించటం వల్లే కియా పరిశ్రమ వచ్చిందని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. గుంతకల్లు బ్రాంచి కెనాల్లో శిథిలావస్థలో ఉన్న అండర్ టన్నెల్స్ మరమ్మతులు చేపట్టని కారణంగా.. లీకేజీలతో నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టకనుమ రిజర్వాయర్ రద్దు, ముట్టాల ప్రతిపాదన పనులు జరగడం లేదని విమర్శించారు..
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..