మాకవరపాలెం మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం జనసైనికులకు కొండంత భరోసా ఇస్తుందని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర అన్నారు శుక్రవారం మాకవరపాలెం కామేశ్వరమ్మ ఆలయం వద్ద జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జనం కోసం మేమున్నాం అనే ధైర్యం నింపుతూ ఎన్నో ప్రజా సమస్యలపై గళమెత్తి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుల్లో నడుస్తూ ఆశయాల ప్రయాణాన్ని సాగిస్తున్న తన సైన్యం ఆపత్కాలంలోఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఎంతో నిబద్ధతతో పార్టీ భావజాల వ్యాప్తికి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీ కొరకు అనుక్షణం శ్రమించే పార్టీ కార్యకర్తలను కుటుంబంగా భావించి వారి యోగ క్షేమాలు కాంక్షించి జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన మహా సంకల్పం ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం అన్నారు నిరంతరం పార్టీ కొరకు శ్రమించే కార్యకర్తలకు అయిదు లక్షల భీమా సౌకర్యం అందించేలా ఈ కార్యక్రమం రూపొందించారన్నారు సభ్యత్వం తీసుకొనే వారు నామమాత్రంగా కొద్దిపాటి రుసుంను వారి వ్యక్తిగత బాధ్యతగా భావించి కేవలం అయిదు వందల రూపాయలు చెల్లిస్తే ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ.అయిదు లక్షల భీమా కుటుంబ సభ్యులకు అందించడం జరుగుతుందన్నారు అలాగే ఏదైనా ప్రమాదం జరిగితే యాభై వేల రూపాయలు ప్రమాద భీమాతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా వైద్య సేవలు అందుకునే వెసులుబాటుతో పాటు ఆరోగ్య భీమా అందిస్తారన్నారు కావున జనసేన పార్టీ సభ్యత్వ నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు అంతేకాకుండా వచ్చేది జనసేన ప్రభుత్వమని ప్రజాస్వామ్య బద్దమైన పరిపాలన జనసేన అందిస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమం అనంతరం నర్సీపట్నం ఇంచార్జ్ రాజాన సూర్యచంద్ర ను మండల నాయకులు శాలువతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు నమ్మి రమణరాజు కర్రి సంతోష్ నమ్మి మంగరాజు నమ్మి కొండబాబు దుర్గాప్రసాద్ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్