రాబోయే రెండురోజులు.. ఏపీలో పిడుగులతో కూడిన భారీవర్షాలు..

 

తెలుగు రాష్ట్రాలు వర్షాలతో అల్లాడిపోతున్నాయి.మండు వేసవిలో అకాల వర్షాలు, పిడుగులు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. ఐఎండి అంచనా ప్రకారం తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ మరియు కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి డా. బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..సోమవారం కోనసీమ,పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం,కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Akhand Bhoomi News

error: Content is protected !!