గర్భిణీలకు,బాలింతలకు ఇంటికే పోషకాహారం పథకం
ఆలమూరు (అఖండ భూమి వెబ్ న్యూస్ :
ఆలమూరు మండలంలోని చెముడులంక గ్రామ పరిధిలోగా అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు,బాలింతలకు ఇంటికే పోషకాహారం పథకం సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ తమ్మన మాట్లాడుతూ ఇంత క్రితం గర్భిణీలకు బాలింతలకు అంగన్వాడి సెంటర్ వద్ద వంటచేసి పెట్టేవారని కానీ దానివల్ల కొంతమంది ఆహారానికి దూరంగా ఉంటున్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికే ఈ పోషకాహార పదార్థాలు పంపిణీ చేసి గర్భిణీలు రక్తహీనత లేని బిడ్డలకు జన్మనివ్వాలని అలాగే బాలింతలు బలంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంటికి ఇచ్చే సరుకులు బియ్యం 3కేజీలు,కందిపప్పు 1కేజీ,నూనె అరలీటరు,పాలు 5 లీటర్లు,రాగి పిండి 2 కేజీలు,అటుకులు 1 కేజీ,బెల్లం 250 గ్రాములు,చిక్కిలు 250 గ్రాములు,కర్జూరం 250 గ్రాములు పంపిణీ చేయడం జరుగుతుందని,కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోషకాహారాన్ని వినియోగించుకుని ఆరోగ్యకరంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు అడబాల వీర్రాజు,దొండపాటి చంటి,మోటూరి సురేష్,అడబాల సూర్యనారాయణ,బొర్రా వీరబాబు,సచివాలయ సిబ్బంది,అంగన్వాడీ సూపర్వైజర్,అంగన్వాడీ టీచర్స్,ఆయాలు,గర్భిణీలు,బాలింతలు పాల్గొన్నారు.