ప్రజలకు నాణ్యమైన పాలన అందించడమే మన జగనన్న ప్రభుత్వం లక్ష్యం,ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి (అఖండ భూమి వెబ్ న్యూస్ :
రాజవొమ్మంగి మండలంలో లబ్బర్తి సచివాలయంలో లబ్బర్తి పంచాయితీ పరిధిలో నెల్లిమెట్ల ,సీతారాంపురం, ముల్లిమెట్ల గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే ధనలక్ష్మి గ్రామలలో ప్రతి ఇంటికి వెళ్లి ఈ నాలుగు సంవత్సరాలలో మన ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఆయా పథకాల ద్వారా లబ్ధిదారులకు నగదు ఎంత వచ్చిందో కూడా తెలియజేశారు. రానున్న కాలంలో కూడా ఈ సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని తెలియజేశారు. అర్హత ఉండి, సంక్షేమ పథకాలు అందని వారికి , సరిచేసి, అర్హులైన వారందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేచించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాజవొమ్మంగి మండల వైసిపి కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ ఎంపీపీ గోము వెంకటలక్ష్మి జడ్పీటీసీ ఒడుగుల జ్యోతి,వైస్ ఎంపీపీలు,సర్పంచులు, ఎంపీటీసీలు,సొసైటీ ప్రెసిడెంట్, వివిధ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ కోఆప్షన్ నెంబర్, వైస్ సర్పంచులు, వార్డ్ మెంబర్లు, సచివాలయం కన్వీనర్లు గృహసారదులు, ఎక్స్ సర్పంచ్లు ఎక్స్ ఎంపిటిసిలు,ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.