యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు: ఏసిపి జగదీష్ చందర్.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రతినిధి అఖండభూమి వెబ్ న్యూస్ :
ఆగస్టు 04. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో నూతన ఏసిపి జగదీష్ చందర్ శుక్రవారం ఫ్రెండ్లీ పోలీసింగ్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించి 100 మంది పోలీసులతో అవగాహన కల్పించారు. ధ్రువ పత్రాలు లేని (66) వాహనాలను సీజ్ చేశారు. ఒక పాత నేరస్తుడిని ఇద్దరూ అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసిపి జగదీష్ చంద్ర మాట్లాడుతూ నేటి యువత గంజాయి. మద్యం. గుట్కా లకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి నడవడికతో బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని సూచించారు. వాహనం నడిపేవారు డ్రైవింగ్ లైసెన్స్. ఇన్సూరెన్స్ తో పాటు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అన్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చేవారు ఆధార్ కార్డ్ ధృవపత్రము తప్పనిసరిగా తీసుకొని అద్దెకు ఇవ్వాలని కాలనీవాసులు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలను అరికట్టవచ్చని అన్నారు. సీజ్ చేసిన వాహనదారులు ధ్రువపత్రాలను తీసుకువస్తే వాహనాలను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ హెచ్ ఓ సురేష్ బాబు. రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి. భీంగల్ సీఐ వెంకటేశ్వర్లు. ఆర్మూర్ ఎస్సై గంగారం. డివిజన్ ఎస్ఐలు. కానిస్టేబుల్. హోంగార్డులు పాల్గొన్నారు.