పర్యటక ప్రాంతంగా ఆంధ్ర కాశ్మీర్ బోడ కొండమ్మ ఆలయం.
అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి 40.00 లక్షల ఎంపీ లాండ్స్ నిధులతో ఆలయ సమీపంలో వ్యూ పాయింట్,టాయిలెట్స్,జలపాతం ఆధునికరణ.
స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గొడ్డేటి మహేష్ బాబు !!!
అల్లూరి జిల్లా చింతపల్లి/ గూడెం కొత్త వీధి (అఖండ భూమి) అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం,చింతపల్లి మండలం,నర్సీపట్నం-చింతపల్లి ప్రధాన రహదారి లంబసింగి ఘాట్ లో కొలువైన బోడ కొండమ్మ ఆలయం పర్యాటక ప్రాంతంగా రూపు దిద్దుకొనుంది.
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు,పర్యటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఆలయ సమీపంలో వ్యూ పాయింట్,అప్రోచ్ సిసి రోడ్డు,టాయిలెట్స్, ఆధునికరించేందుకు గాను అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి 40.00 లక్షల రూపాయలు వారి ఎంపీ లాండ్సనిధులుకేటాయించారు.
ఈ సందర్భంగా ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గొడ్డేటి మహేష్ బాబు కొబ్బరికాయ కొట్టి నిర్మాణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.ప్రకృతి సహజమైన పర్యటక ప్రాంతాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేసుకుని బోడకొండమ్మ ఆలయ సమీపంలో అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి ఎంపీ నిధులు 40.00 లక్షలతో నిర్మాణ అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు.
వ్యూ పాయింట్ నిర్మించి స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టి పర్యటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎంపీపీ అనూష దేవి,స్థానిక సర్పంచ్ శాంతి కుమారి,ఉప సర్పంచ్ డేవిడ్ రాజ్,ఎంపీటీసీ రావుల నాగమణి,డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు,గ్రామ పెద్ద చిట్టిబాబు,చింతపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ప్రెసిడెంట్ మోరి రవి,వైసిపి నాయకులు రామ్మూర్తి,గాంధీ,సురేష్ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..