బీజేపీ నేత కురుస బొజ్జయ్య కు ఘన నివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు, గిరిజన ప్రజలు

 

 

బీజేపీ నేత కురుస బొజ్జయ్య కు ఘన నివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు, గిరిజన ప్రజలు

బొజ్జయ్య గారి విగ్రహం ఆవిష్కరించిన విశాఖ పార్లమెంట్ ఇంచార్జి పుట్ట గంగయ్య

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి/ పాడేరు (అఖండ భూమి) బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుస బొజ్జయ్య నాల్గవ వర్ధంతి సందర్బంగా అయన స్వగ్రామం ఐన కొత్త పాడేరు లో అయన విగ్రహన్ని విశాఖ పార్లమెంట్ ఇంచార్జి పుట్ట గంగయ్య ఆవిష్కరించారు, అనంతరం విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు, ఈ సందర్బంగా విశాఖ పార్లమెంట్ ఇంచార్జి పుట్ట గంగయ్య మాట్లాడుతూ విశాఖ మన్యం లో బొజ్జయ్య అంటే బీజేపీ, బీజేపీ అంటే బొజ్జయ్య అనే పేరు ఉండేదని అన్నారు, గిరిజన ప్రాంతంలో బీజేపీ పార్టీ నీ బలోపేతం చెయ్యడం లో అయన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు, గిరిజన ప్రజల సమస్యల పరిస్కారం కోసం అయన అనేక ఉద్యమాలు చేసారని, అహర్నిశలు గిరిజన ప్రాంత ప్రజల కోసమే అయన ఆలోచన చేసేవారని అన్నారు, కురుస బొజ్జయ్య మొదట గిరిజన సహకార సంస్థ లో ఉద్యోగం చేసేవారని, అయన ఆ ఉద్యోగాన్ని సైతం తృణ ప్రాయంగా వదులు కుని ప్రజా సమస్య ల పరిస్కారం కోసం బీజేపీ పార్టీ 1980 లో చేరరాని అనంతరం అనేక పార్టీ బాధ్యతలు చేపట్టి 1985 లో బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే గా గిరిజన ప్రాంతం నుంచి పోటీ చేసారని గుర్తు చేశారు, కేంద్ర కాపీ బోర్డు సభ్యులు గా, ట్రైపేడ్ డైరెక్టర్ గా కేంద్ర నామినేటెడ్ పదవులు చేపట్టారని అన్నారు,అయన సోదరి ఐన కురుస పార్వతమ్మ, అయన శ్రీమతి పెద్దమ్మి ల సహకారం తో పార్టీ లో అయన అలుపు లేకుండా పనిచేసేవరనీ, ఆయన తనయుడు గా కురుస ఉమా మహేశ్వర రావు కూడా తండ్రి కి తగ్గ తనయునిగా మంచి పేరుతో బీజేపీ పార్టీ కోసం పని చేస్తున్నారని అన్నారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎల్ కె అద్వానీ,బండారు దత్తత్రేయ, సిహెచ్ విద్యా సాగర్ రావు, కంభం పాటి హరిబాబు, అప్పటి సిక్కిం గవర్నర్ వీ రామారావు,తదితరులతో మంచి పరిచయాలు, సత్సంబంధాలు కలిగి ఉండేవరన్నారు,ఈ సందర్బంగా పలువురు వక్తలు అయన స్మృతులు ను గుర్తు చేసుకుని కంట తడి పెట్టుకున్నారు,ఈ కార్యక్రమం లో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుస ఉమా మహేశ్వర రావు, బొజ్జయ్య సోదరి మాజీ జిసిసి డిఎం కురుస పార్వతమ్మ, ఎంఈఓ కురుస నాగభూషణం,బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మఠం శాంత కుమారి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు, పాడేరు అసెంబ్లీ కన్వినర్ కూడా కృష్ణా రావు, గిరిజన మోర్చా జోనల్ ఇంచార్జి కురుస రాజారావు,జిల్లా ప్రధాన కార్యదర్శి సల్ల రామకృష్ణ,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందోలి ఉమా మహేష్, మినుముల గోపాల పాత్రుడు,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండ బాబు, వివిధ మండల బీజేపీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ సంస్థల ప్రతినిధులు, గిరిజన ప్రజలు, కుటుంబ సభ్యులు,శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!