పుంగనూరు ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన
ఎమ్మెల్యే గొల్ల బాబురావు
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం: కొరుప్రోలు క్యాంపు కార్యాలయం దగ్గర వైసిపి సీనియర్ నాయకులు అందరూ ఈరోజు ఆదివారం నాడు సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటనపై మాట్లాడుతూ చంద్రబాబుపై ఎ 1 కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. వైసిపి నాయకులు పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం జరిగింది. అంత దాడి చేయవలసిన అవసరం మన పార్టీ నాయకులకు లేదంటూ వారి పార్టీలోనే టిడిపి గూండాలను తెచ్చుకొని వారికి వారే దాడులు చేసుకుని వైసిపి నాయకుల మీద నెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. మాకు దాడులు చేసే అవసరం లేదంటూ మా జగనన్న పెట్టిన పథకాలు చూసి ఓర్వలేక దుర్ప్రచారం చేస్తున్నారు అని అయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వైసిపి జిల్లాఅధ్యక్షులు బొడ్డేటి ప్రసాదు జిల్లా వ్యవసాయ సలహాదారులు చిక్కాల రామారావు సీనియర్ నాయకులు పోలిశెట్టి ప్రదేశ్వర రావు స్టేట్ మత్స్యకార వైస్ ప్రెసిడెంట్ మాత గురునాధరావు డి శ్రీపతి రాజు కోసెట్టి వెంకటరమణ బాబి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది



