మార్పు కోరుకునేవారికి గద్దర్ మృతి తీరని లోటు జనసేన అరకు పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య

మార్పు కోరుకునేవారికి గద్దర్ మృతి తీరని లోటు

జనసేన అరకు పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య

ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న జనసేన నేత

అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి పాడేరు అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఉద్యమకారులు, ప్రజా గాయకులు ఉద్యమకారులు గద్దర్ ఇక లేరన్న వార్త తనకెంతో బాధ కలిగించిందని గిరిజన ప్రాంతాల్లో ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ శోక సముద్రంలో మునిగిపోయారు జనసేన అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య ఆదివారం ప్రజా గాయకుడు గద్దర్ స్వర్గస్తులైన నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గంగులయ్య మీడియాతో పంచుకున్నారు. ప్రజా ఉద్యమంలో ఆయనతో భాగం కావడం తాను చేసుకున్న అదృష్టంగా పేర్కొన్నారు. ఒక ఉద్యమ కెరటాన్ని కోల్పోవడం జరిగిందని సమాజం నిత్యం ప్రగతిని కోరుకుంటుందని ఆ ప్రగతి దారుల్లో ఒక ఆశా కిరణం మనకు దూరం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్పులు కోరుకునే అత్యంత తక్కువ మంది వ్యక్తుల్లో గద్దర్ ఒకరిని తెలిపారు. కళలతో ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చు అని నిరూపించిన మహానుభావుడు గద్దరని పేర్కొన్నారు. తన కళలతో ప్రజలను చైతన్యం పరిచి ఎంతోమంది ప్రజాసమస్యల పరిష్కారం వైపు ఉద్యమం దిశగా నడిపేందుకు మార్గం చూపున మహానాడు గద్దరని ఆయన తెలిపారు. ఉద్యమ ప్రదాత ద్రవతార అయినా ఓ మహానీయుడు మననుంచి దూరం కావడం నిజంగా బాధాకరమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు ప్రజా ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆయన తన పాటలతో ప్రజలను చైతన్యం పరిచి తాను మాటలతో ఉద్యమం వైపు నడిపించానని తెలిపారు. సమాజంలో మార్పు కోరుకునే వారికి సమసమాజ నిర్మాణం కోసం పోరాడుతున్న వారికి ఈయన దూరం కావడం తీరిన లోటని తెలిపారు. ఆయనతో కలిసి తాను పాడేరు, చింతపల్లి, రంపచోడవరం వంటి ప్రాంతాల్లో ప్రజా పోరాట ఉద్యమాల్లో పంచుకున్న సందర్భాన్ని గంగులయ్య గుర్తు చేశారు. గద్దర్ తో ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. విముక్తి కోసం పోరాటం చేసే అటువంటి ఉద్యమనేత దూరం కావడం సామాన్య జనానికి తీరని లోటు అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!