ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఈనెల 9న ఘనంగా నిర్వహిద్దాం ఆదివాసి జేఏసీ

 

 

ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఈనెల 9న ఘనంగా నిర్వహిద్దాం ఆదివాసి జేఏసీ

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల కేంద్రంలో ఈ నెల 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆదివాసి జెఎసి అన్ని ఏర్పాట్లను చేస్తుంది ఈ మేరకు ఆదివారం జేఏసీ కార్యవర్గ సభ్యులు అందరూ గుడం కొత్త వీధి మండల కేంద్రంలో సమావేశమై ప్రపంచ అధివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి చేపట్టాల్సిన చర్యలు గూర్చి చర్చించారు మణిపూర్లో ఆదివాసీలపై జరుగుతున్న సంఘటనలకు నిరసన జీవో నెంబర్ 3 పునరుద్ధరణ నూతన అటవీ చట్టాన్ని నిషేధించాలని ఉమ్మడి పౌరస్మృతి ఆమోగ్య యోగం కాదని దీనివలన ఆదివాసి గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆదివాసి ప్రాంతాలలో వన్ బై 70 చట్టాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని గ్రామ సభ పీసా కమిటీ ఆమోదం లేకుండా ఎటువంటి గనులు తవ్వకాలు చేయకూడదని ఆదివాసి ప్రాంతాలలో గిరిజనేతరులు చేపడుతున్న అక్రమ కట్టడాలు కూల్చివేయాలని వంటి సంఘటనలపై ఆగస్టు 9న భారీ ప్రజానీకంతో ర్యాలీ నిర్వహించి ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకోవాలని కమిటీ నిర్ణయించింది ఆదివాసి గిరిజనులకు పండగ లాంటి ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని సెలవు దినముగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని జేఏసీ కమిటీ కోరింది అలాగే గూడెం కొత్త వీధి మండల కేంద్రంలో ఆదివాసి జేఏసీ భవనాన్ని నిర్మించడానికి జేఏసీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి భవన నిర్మాణానికి పూనుకోవాలని ఆదివాసి జేఏసీ కమిటీ తీర్మానించింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేశ్వరరావు సేవ రాజారావు కాలేశ్వరరావు తో పాటు జేఏసీ నాయకులు బలరాం ఎంపీటీసీ బుజ్జిబాబు నీలకంఠం నారాయణరావు సాయం రమణ మార్కు రీ మల పాల్ రామచంద్రుడు తో పాటు పలువురు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!