ప్రభుత్వ పథకాలు కొంతమందికేనా? అంకంరెడ్డి బుల్లిబాబు

కోటనందూరు మండలం అల్లిపూడి లో వైసీపీ ఇసుక అక్రమాలు ప్రభుత్వ పథకాల అమలు పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు గ్రామంలో అర్హులకు ఇళ్ల స్థలాలు లేవని కొంతమంది అనర్హులకి నిబంధనలకు విరుద్ధంగా రెండేసి స్థలాలు ఇచ్చారని ప్రభుత్వ అధికారులు ఇవేమీ తమకు తెలియనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అమలు లో పక్షపాత వైఖరి చూపిస్తున్నారని గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వర్షాలు కురిస్తే వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోయి దోమల సంఖ్య వృద్ధి చెంది గ్రామ ప్రజలు అనేక వ్యాధుల భారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వైసిపి అధికారంలోకి వచ్చి కాలం గడిచిపోతున్న ఒక సిమెంట్ రోడ్డు కానీ ఒక డ్రైనేజీ కానీ నిర్మించలేదని బుల్లిబాబు అన్నారు వైసీపీ నాయకులు ఇసుక మట్టి మీద పెట్టిన శ్రద్ధ గ్రామ అభివృద్ధి కోసం పెట్టలేదన్నారు రోడ్లపై ఇసుక మట్టి పేరుకుపోవడంతో ఆ దారిని వెళ్లే వాహనదారులు పడిపోయి గాయాల పాలవుతున్నారని వర్షాకాలం వస్తే రోడ్లు బురదమయపోతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తే పథకం కట్ అనేటట్లుగా నియంత పాలన చేస్తున్నారని ఆయన అన్నారు నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారని వైసీపీ నాయకుల వైఖరి తీరు పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారని 2024 ఎలక్షన్ లో తెలుగుదేశం గెలుపు తద్యమని  ఆయన అన్నారు గ్రామ అభివృద్ధికి పాటుపడడం అంటే అక్రమాలు చేయడం కాదని గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలైన డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్లు నిర్మాణాలు చేపట్టాలని పథకాలు అమలులో నిష్పక్షపాత వైఖరి అవలంబించాలని ఆయన అన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!