తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ సిడి శివ

 

 

 

తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ సిడి శివ

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి (అఖండ భూమి) ఆగస్టు 7 రాజవొమ్మంగి మండలం దూసరపాము పంచాయతీలో త్రాగునీటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు సర్పంచ్ చీడి శివ అన్నారు. సోమవారం దూసరపాము గ్రామ ఎస్టీకాలనీలో చేతిపంపును సర్పంచ్ దగ్గర ఉండి మరమ్మత్తులు చేయించారు. పంచాయతీలో 26 చేతిపంపులు ఉండగా మరమ్మత్తులకు గురైన 12చేతిపంపులను బాగు చేయించి వినియోగంలోకి తేవడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస సుబ్రమణ్యం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీడి శివ, ఉపసర్పంచ్ అధికారి సత్యనారాయణ, వార్డు మెంబరు చీడి గంగ, మంతెన ముసలయ్య, కనిగిరి రాజబాబు, కలవలపల్లి రాంబాబు, స్థానికులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!