అఖండ భూమి హుకుంపేట:- సాలేపుగొంది గ్రామంలో జడ్పీ నిధులతో కల్వర్టు మంజూరు చేయనునట్లు జడ్పీటీసీ రేగం మత్య్సలింగం తెలిపారు.మండలంలో కొట్నాపల్లి పంచాయతీ లోపోలం,ఎగువమాలపాడు తదితర గ్రామాలకు ఆదివారం సందర్శించి పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు గురించి ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో 20 కుటుంబాలు నివాసం ఉన్నట్లు బడి ఈడు పిల్లలు 27 మంది ఉన్నట్లు బడి లేక 03 పిల్లలు లోపొలం పాటశాల కు 06మంది పిల్లలు బొర్రబాకురు పాఠశాల కు వెళ్తున్నట్లు గ్రామ ప్రజలు జడ్పీటీసీ దృష్టి తెలిపారు. చిన్నపిల్లలు అంగన్వాడీ కేంద్రాము లేక ఇంటి వద్ద ఉంటున్నట్లు తెలిపారు. పాఠశాల.అంగన్వాడీ కేంద్రం కావాలని కోరారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పలు గ్రామాల్లో ఉన్నా సమస్యల పై ఉన్న స్థాయి అధికారులకు దృష్టిలో తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. జిల్లా పరిషత్ నిధులు ద్వారా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఎంపీటీసీ సర్పంచ్ లకు సూచించారు.ఈకార్యక్రమంలో
కొట్నాపల్లి సర్పంచ్ కాకరి బొంజాబాబు. వైఎస్ఆర్సీపీ నాయకులు కొర్ర గురుమూర్తి, గెమ్మేలి రామారావు, గేమ్మెలి లక్ష్మైయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l
నవీన్ యాదవ్ విజయమే ప్రజా ప్రభుత్వానికి దీవెనలు….


