అధ్వానంగా రహదారి…
వెల్దుర్తి ఆగస్టు 12 అఖండ భూమి వెబ్ న్యూస్ : మండల పరిధిలోని పాడు గ్రామ శివారులలో కల్లం దొడ్లకు అనుకొని గుంతల మయంగా రహదారి ఏర్పడింది. నిత్యం వెల్దుర్తి నుండి చెరుకులపాడు మీదుగా క్రిష్ణగిరికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానమైన పరిస్థితిలో ఉన్న పట్టించుకున్న పాపాన పోలేదని వాహనదారులు తెలుపుతున్నారు. వెల్దుర్తి నుండి చెరుకులపాడు గ్రామంలోకి గుంతల మయంగా ఉన్న రహదారి దర్శనమిస్తుంది. సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రధాన రహదారి వెల్దుర్తి నుండి క్రిష్ణగిరి వరకు మరమ్మతులు చేయించి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు ఎంతైనా ప్రయాణికులు కోరుతున్నారు.



