ప్రధాన రహదారులన్నీ గుంతలమయం…

 

 

ప్రధాన రహదారులన్నీ గుంతలమయం…

క్రిష్ణగిరి ఆగస్టు 12 అఖండ భూమి వెబ్ న్యూస్  :

క్రిష్ణగిరి నుండి ఎరుకల చెరువు మీదుగా ఈదుర్ల దేవరబండ వెళ్లే రహదారి ఆగవేలి వరకు ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. దీంతో ప్రయాణికులు వాహనాలలో బిక్కుబిక్కుమని ప్రయాణాలు చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితులలో ప్రయాణికులు ఉన్నామని తెలుపుతున్నారు. వర్షాకాలం అయ్యేసరికి గుంతలలో నీరు నిండుకొని ఇబ్బందులు పడుతున్నట్లు క్రిష్ణగిరి మండల ప్రజలు తెలుపుతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు రహదారుల మెయింటెనెన్స్ సక్రమంగా చేయకుండా నిమ్ముకు నీరెక్కి నట్టుగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని వాహనదారులు తెలుపుతున్నారు. పాలకులు రహదారుల సంక్షేమం చూడకుండా సొంత ఆర్థిక ప్రయోజనాలకు మాత్రమే ప్రియారిటి ఇస్తున్నారని విమర్శలు లేకపోలేదు. ఇది ఏమైనా రహదారి మరమ్మత్తులు చేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!