నాతవరం తాండవ రోడ్డు మరమ్మత్తుల కోసం ఈ నెల 16 నుంచి నిరసన కార్యక్రమం- జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్యచంద్ర

అస్తవ్యస్తంగా ఉన్న  నాతవరం తాండవ రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని    డిమాండ్   చేస్తూ  ఈనెల  16 న   నాతవరం తహశీల్దార్   కార్యాలయం  వద్ద   నిరసన    కార్యక్రమం చేప డతామని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజక వర్గ   ఇన్చార్జ్ రాజాన సూర్యచంద్ర పేర్కొన్నారు గురువారం తాండవ రోడ్డును  పరిశీలించడానికి  జన సైనికులతో     కలిసి  బయలు దేరగా పోలీసులు అడ్డుకున్నారు పోలీసు యాక్టు 30 ఉందని, ఎటు వంటి అనుమతి లేదంటూ  జనసేన  నాయకులను  భారీ గా  పోలీసులు   మోహరించి  అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీర      సూర్యచంద్ర మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ఈ రోడ్డు అధ్వాన్నం గా  ఉందన్నారు వర్షాకాలంలో మరింత  దారుణంగా  తయారైందన్నారు. దీంతో   ప్రజలు ప్రయాణికులు ఈ  రోడ్డు పై ప్రయాణం  చేయడానికి  అనేక ఇబ్బందులు పడుతున్నారన్నా రు వర్షాలు పడే సమయంలో రోడ్లపై  ఏర్పడిన  గుంతల్లో నీరు  చేరి మరి దారుణం  గాతయారవుతుందన్నారు.నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ ఈ రోడ్డుకు కనీసం మరమ్మత్తులు చేయించలేని దుస్థితిలో ఉన్నారన్నారు.  ఎమ్మెల్యే నిత్యం ఈ రోడ్డుపై వెళుతున్నాసమస్య ను  సీరియస్ గా తీసుకోవడంలో విఫల మయ్యారన్నారు తాండ వ నీరువిడుదల సందర్భంగా  ఈరోజు కూడా ఎమ్మెల్యే గణేష్  ఈ  రోడ్డుపై ప్రయాణించారని, అయినా కనీసం స్పందనలేదన్నా రు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గతం లోఎన్నో సార్లు ఆందోళనలు, నిరసనలు, పాదయాత్ర కార్యక్రమాలు చేపట్టామ న్నారు. గతంలో తన సొంత నిధులతో గోతు లను కప్పించే  కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.  ఎన్నిసార్లు నిరసనలు  తెలిపినా అధికారుల్లో గానీ, ప్రజా ప్రతినిధుల్లో కానీ కనీసం చలనం లేదన్నారు. కావున ఈ నెల 16న నాత వరం తహశీల్దార్ కార్యాలయం వద్ద టెంట్ వేసి నిరసన కార్య  క్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండల అధ్యక్షలు వెలగల వెంకట రమణ, నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, నాతవరం మండల నాయకు లు పోలుపర్తి సూరిబాబు, మాకిరెడ్డి వెంకట రమణ, నమ్మి మంగరాజు, మొండి శివ తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!