నాతవరం మండలం గొలుగొండపేట లో నా భూమి నా దేశం కార్యక్రమం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు స్థానిక అమరవీరుల పేర్లు గల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెంకట రమణ మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిపెంపొందించాలని యువతలో దేశం పట్ల దేశభక్తి పెరగాలని కాంక్షిస్తూ స్వాతంత్ర్యోద్యమఅమరవీరులకు నేల తల్లికి వందనం సమర్పించారు అమరవీరులను త్యాగులను మహనీయులను స్మరించుకోవడం అవసరం అన్నారు ప్రతీ భారతీయునిలో అమర వీరుల స్ఫూర్తిని నింపడం ఎంతైనా అవసరం ఉందని ఆయన అన్నారు అనంతరం అమరవీరుల సంస్మరణ కు చిహ్నంగా మొక్కలను నాటి పంచప్రాణ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో గొలుగొండ పేట సర్పంచ్ వెంకటరమణ ఎంపీటీసీ సత్యనారాయణ సెక్రటరీ రాజబాబు ఏపీవో చిన్నారావు గ్రామ ప్రజలు పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు

ANDHRA NEWS PAPER POLITICS STATE

