గునుపూడి లో లోపించిన పారిశుద్ధ్యం – టిడిపి సీనియర్ నాయకులు సబ్బవరపు దేవుడు

నాతవరం మండలం గునుపూడి లో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు మలేరియా టైఫాయిడ్ వంటి అనేక వ్యాధుల బారిన పడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సబ్బవరపు దేవుడు అన్నారు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయడం లేదని డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడం వలన దోమలు అధికంగా వృద్ధి చెంది వ్యాధులను వ్యాప్తి చేస్తున్నాయని ఆయన అన్నారు అంతేకాకుండా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను బోధనకు సంసిద్ధులను చేయటకు అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించకుండా తరగతుల నిర్వహణ సమయంలో నెలల తరబడి నిర్మాణాలను చేపట్టడంతో అనవసరమైన శబ్దాలు ఉద్భవించడం కారణంగా విద్యార్థుల ఏకాగ్రత లోపించి ఉపాధ్యాయులు బోధించినది విద్యార్ధులకు అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు అంతేకాకుండా పాఠశాలలో తరగతి గదుల దగ్గరలో మురికి నీరు నిల్వ అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమల వృద్ధి అధికమై తరగతి గదుల్లో విద్యార్థులు దోమ కాటుకు గురై వ్యాధులు బారిన పడుతున్నారని ఆయన అన్నారు ఇదిలా ఉండగా పాఠశాల రక్షణ గోడ కూలి గేట్లు ధ్వంసం అయ్యాయని గడ్డి విపరీతంగా పెరిగి విష  సర్పాలు సంచరిస్తున్నాయని  ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలని ఆయన అన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!