
గుంటు పల్లెలో దాహం…! దాహం…!!
పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు…
ఇబ్బందుల్లో గ్రామ ప్రజలు…
వెల్దుర్తి ఆగస్టు 13 అఖండ భూమి వెబ్ న్యూస్ :
సూదేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మజర గ్రామం గుంటుపల్లి గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న వైనం ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ ప్రజలు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. గత వారం రోజుల నుండి నీరు లేక సుదూర ప్రాంతం నుండి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదు. సుదూర ప్రాంతాల నుండి నీటిని తీసుకొని వచ్చి అవసరాలు తీర్చుకుంటున్నట్లు తెలిపారు. అయితే గ్రామపంచాయతీ నందు నిధులు లేకపోవడంతో మోటర్ మరమ్మత్తులు చేయించుకోవడానికి కూడా విధులు లేక పంచాయతీ అధికారులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. పాలకులు మాత్రం గ్రామం వైపు తొంగి చూడకుండా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. గ్రామపంచాయతీ అధికారులు మోటార్ మరమ్మత్తులు చేయించి మా గ్రామ కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


