రహాదారి దుస్థితికి తిలా పాపం తలా పిడికెడు..

 

 

అంతర్రాష్ట్ర రహదారి పరిస్థితిలా పాపం తలా పిడికెడు అన్న విధంగా తయారయింది:ఆదివాసి జెఏసి

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) అంతర్రాష్ట్ర రహాదారి దుస్థితికి తిలా పాపం తలా పిడికెడు అని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు ఎద్దేవా చేసారు.అంతర్రాష్ట్ర రహాదారి దుస్థితి ఎమ్మెల్యే,ఎంపీలకు పట్టదా?అని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి సెల్ఫీ చాలెంజ్ ప్రస్తుత ఎమ్మెల్యే,ఎంపీలకు ప్రశ్నించడం, ప్రస్తుత పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఉపాధి హామీ పధకం నిధులు 4.30 కోట్లు మంజూరు చేయించినట్లు ప్రకటించడం పై ఆదివాసి జెఏసి స్పందించింది.గత 25 ఏళ్ల నుండి ఈ అంతర్రాష్ట్ర రహాదారికి మరమ్మత్తుల్లేక పూర్తిగా పాడైపోయి శిధిలమైపోయింది.ఆ రహాదారి నిర్మించాలని కొత్తగా అడగడం లేదు.గత 25 ఏళ్ల నుండి ఎవరైతే పాలకులు ఉన్నారో వారిందరికి అడుగుతూనే ఉన్నామని,కానీ ఎవరు పట్టించుకోలేదని,గిడ్డి ఈశ్వరీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దివంగత బిజెపి నేత లోకుల గాంధీ దారకొండలో నిరహార దీక్ష చేస్తే రాజకీయంగా విమర్శలు గుప్పించారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత వై జంక్షన్ లో వంట వార్పు కార్యక్రమం చేస్తూ మండల బంద్ చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి ఆధ్వర్యంలో సీలేరు నుండి జికె వీధి వరకు పాదయాత్ర చేస్తే ఎంతో కొంత రహాదారి బాగుచేసారు.కానీ వైయస్సార్ సిపి నాయకులు ఆదివాసి జెఎసిపై విమర్శలు గుప్పించారు.ఎవరు ఎన్ని కోట్లు కేటాయించిన అటవీశాఖ అఢ్డుపడుతోందన్న విషయం ఈ పాలకులకు తెలియకపోవడం గమనార్హం.కనీసం సింగిల్ లైన్ కూడా వేయించలేకపోవడం వీరి పని తీరుకు నిదర్శనం.సీలేరు సర్పంచ్ ఎన్నికల కోసం పాడేరు ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే ఈ రహాదారి గురించి మాట్లాడటం చూస్తుంటే రాజకీయ నాయకులకు సిగ్గుండదు,స్మశనానికి ముగ్గు ఉండదని నానుడి గుర్తుకొచ్చిందని,సర్పంచ్ ఎన్నికల కోసమే ఇన్ని నాటకాలు ఆడుతున్న వీరు,రాబోయే సాధారణ ఎన్నికలకు ఎన్ని కళలు చూపిస్తారోనని ఎద్దేవ చేసారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి మండల కోకన్వీనర్ కొర్ర నీలకంఠం,ప్రధాన కార్యదర్శి బత్తుల సిద్ధార్ద మార్క్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!