డీడీలు కట్టిన గొర్రెల కాపరులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గొర్రెలను పంపిణీ చేయాల
అఖండ భూమి సూర్యాపేట జిల్లా కోదాడ.
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ పథకంలో యాదవులు అప్పులు తెచ్చి మరి డీడీలు తీసి 4 నెలలు దాటినా గొర్రెలను పంపిణీ చేయకపోవడం దారుణం అన్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికల కోడ్ సమీపస్తునడం తో గొర్రెల పంపిణీ జరగకపోవచ్చు అన్న ఆందోళనలో యాదవులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే గొర్రెల పంపిణీ పథకం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. యాదవులు గొర్రెల కొనుగోలు కోసం పరాయి రాష్ట్రాల్లో 10 నుంచి 15 రోజులపాటు పడరాని పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యవంతమైన గొర్రెలు దొరక్క ఇక్కడ వాతావరణానికి గొర్రెలు ఇమడక గొర్రెలు మృతి చెంది తీవ్రంగా నష్టపోతున్నారని గొర్ల కాపర్లు చెబుతున్న మాటలు పరిశీలించాలని కోరారు. గొర్రెల పంపిణీ పథకంలో నగదు బదిలీ తో నేరుగా గొర్రెల కాపరుల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకాన్ని గ్రామాల్లో అమలు చేసినట్టుగానే మున్సిపాలిటీలో జీవిస్తున్న గొల్ల కురుమలకుకూడ వర్తింపజేయాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క గొల్ల కురుమల బిడ్డకు సభ్యత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు .
ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు ఇనుగుర్తి వెంకటరమణ చారి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బచ్చు రాజ్యం, జిల్లా ఉపాధ్యక్షులు నిగిడాల వీరయ్య బొడ్డుపల్లి సుందరయ్య మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు మండవ నాగమణి దొంగరి కృష్ణ తదితరులు ఉన్నారు
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



