పరవళ్ళు తొక్కిన 50 ఏళ్ల స్నేహబంధం.

 

పరవళ్ళు తొక్కిన 50 ఏళ్ల స్నేహబంధం…

ఘనంగా1972.73 అఖండ భూమి సూర్యాపేట జిల్లా కోదాడ.టెన్త్ క్లాస్ జడ్.పి.హెచ్.ఎస్ కోదాడ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం… 50 ఏళ్ల అనంతరం పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో కలుసుకున్న బాల్య స్నేహితులు….. కొడుకులు, కోడళ్ళు,కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మిత్రులు…. తాత వయస్సు లో అలరించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం…… వాళ్లందరి వయస్సు 65 నుండి 75 సంవత్సరాలు వాళ్లంతా తాతలయ్యారు. పదవ తరగతి పూర్తి చేసిన 50 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా బాల్య స్నేహితం మర్చిపోకుండా అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా కుటుంబ సభ్యులతో కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. కోదాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1972..73 లో పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల అపూర్వ కలయిక ఇది. కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ బంకెట్ హాల్ ఆదివారం నిర్వహించుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వీరంతా వయసును మరిచి చిన్నపిల్లల మాదిరిగా అరేయ్ ఒరేయ్ అనుకుంటూ ఉల్లాసంగా గడిపారు చదువుకున్న రోజుల్లోని స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు పరిచయ కార్యక్రమంలో కుటుంబ సభ్యులను కుమారులను కోడళ్ల ను,కూతుర్ల ను తోటి మిత్రుల కు పరిచయం చేసి ఆత్మీయ బంధాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నాడు వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎక్బాల్, విద్యాసాగర్ ,వెంకటరెడ్డి లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ 10 15 ఏళ్లకే ఒకరికొకరు మర్చిపోతున్న ఈ రోజుల్లో 50 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుంచుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాలు అరుదుగా జరుగుతుంటాయని నిర్వహించిన నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పూర్వ విద్యార్థులు వంగవీటి రామారావు వేనే పల్లి సత్యనారాయణ, బండ్ల మదన్మోహన్ మర్ల రఘురామయ్య, సుబ్బారావు నారాయణ అనంత రాములు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!