నాతవరం మండలం గొలుగొండపేట లో నా భూమి నా దేశం కార్యక్రమం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు స్థానిక అమరవీరుల పేర్లు గల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెంకట రమణ మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తి పెంపొందించాలని యువతలో దేశభక్తి పెరగాలని స్వాతంత్ర్యోద్యమ అమర వీరులకు వందనం సమర్పించారు అమరవీరులను స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉందన్నారు ప్రతీ భారతీయునిలో అమర వీరుల స్ఫూర్తిని నింపడం ఎంతైనా అవసరం ఉందని ఆయన అన్నారు అనంతరం అమరవీరుల సంస్మరణకు చిహ్నంగా మొక్కలను నాటి పంచప్రాణ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరమణ, ఎంపీటీసీ సత్యనారాయణ ,సెక్రటరీ రాజబాబు, ఏపీవో చిన్నారావు, గ్రామ ప్రజలు, పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్