ఉచితంగా వైద్యం… మందులు పంపిణీ..

 

 

అఖండ భూమి సూర్యాపేట జిల్లా కోదాడ.

వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యం లో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యముతో ఈరోజు ఆదివారం స్థానిక ఆర్ఎస్ వి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిభిరం లో 500 మంది కి పైగా ప్రజలకి గుండె, థైరాయిడ్ సంబంధ వ్యాధులకు ఈసీజీ, టుడి ఎకో, రక్త పరీక్షలు నిర్వహించి అందరికి ఉచితంగా మందులు అందించటం జరిగింది.

మొదటగా ఈ కార్యక్రమాన్ని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, డాక్టర్ కేబిన్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. డా ప్రమీల శ్రీపతిరెడ్డి, వైస్ మునిసిపల్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్, విద్యావేత్త నీల సత్యనారాయణ, బ్రహ్మం గారి గుడి చైర్మన్ జుకూరి అంజయ్య లు కలిసి వివిధ క్యాబిన్లను ప్రారంభించారు.

ఈ సందర్భముగా ఎంఎల్ఏ మాట్లాడుతూ వాసవి క్లబ్ కోదాడ వారు ప్రజలకు అందిస్తున్న సేవలను అభినందించారు. అధ్యక్షులు ఇమ్మడి సతీష్ వైవిధ్యంగా ఆలోచిస్తూ ప్రజలకి క్లబ్ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు వేనోళ్ళ అభినందిస్తున్నారని వచ్చిన వక్తలు పేర్కొన్నారు.

ఐపీసీ, program చైర్మన్ చల్ల విజశేఖర్ పరిచయాలతో రమేష్ హాస్పిటల్స్ వారిని ఒప్పించి కోదాడ లో శిబిరం పెట్టించటం ఇక్కడి ప్రజలకు ఉపయోగకరమైంది అని తెలిపారు.

ఈ కార్యక్రమం లో దాతలు లిఖిత ఆర్కేడ్ ఎండి పందిరి రాజశేఖర్, వాసవి క్లబ్ కార్యదర్శి వెంపటి ప్రసాద్, జూకూరి అంజయ్య, కందిబండ ఉపేందర్ లకు పూల గుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

దీనిలో పాల్గొన్న రమేష్ హాస్పిటల్ డాక్టర్ లు డా అవినాష్, డా గోపాలాదత్త, హాస్పిటల్స్ మార్కెటింగ్ మేనేజర్స్ సీతారాంరెడ్డి, వెంకట్ మరియు స్టాఫ్ కు అధ్యక్షులు, కమిటీ మెంబెర్స్ కృతజ్ఞతలు తెలియచేసారు.

ఈ కార్యక్రమం లో అధ్యక్షులు ఇమ్మడి సతీష్ బాబు, కార్యదర్శి సేకు శ్రీనివాసరావు, కార్యదర్శి వెంపటి ప్రసాద్, గవర్నర్ వంగవీటి వెంకట గురుమూర్తి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పబ్బా గీత, యాదా రాణి, ఓరుగంటి రమాదేవి, రీజియన్ చైర్మన్ జగిని ప్రసాద్, REC doguparty హైమావతి, RS పైడిమర్రి సతీష్, శ్రీరంగం లక్ష్మణ్, పందిరి సత్యనారాయణ వివిధ క్లబ్బుల PST లు palgonnaaru

Akhand Bhoomi News

error: Content is protected !!