ఆపదలో ఉన్న పాపకు ఆయుష్షు పోస్తానన్న జగనన్న ….

 

 

ఆపదలో ఉన్న పాపకు ఆయుష్షు పోస్తానన్న జగనన్న

మీ పాపకు నేనున్నానంటూ భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి

గతంలో పాప వైద్యానికి ఖర్చుపెటిన లక్ష తల్లి ఖాతాలో జమ

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి/ కూనవరం, (అఖండ భూమి) వరద బాధితులను పరామర్శించడానికి కూనవరం వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించిన 2,000 వేలు,నిత్యవసర వస్తువులు అధికారులు మీకు అందజేశారా అని బాధితుల నుండి స్వయంగా తెలుసుకొని మీకు ఉన్న ప్రధాన సమస్యను కూడా పరిష్కరిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణంలో అనారోగ్యంగా ఉన్న పాప వేముల శివ చంద్రిక ను తల్లి వేముల నాగమణి పాపను ఎత్తుకొని, తండ్రి వేముల సతీష్ వారి బాధను స్వయంగా ముఖ్యమంత్రి కే విన్నవించుకుందామని రోడ్డుపై ఎదురు చూస్తుండగా ఆ పాపను చూసి కాన్వాయ్ ఆపి స్వయంగా తానే పాప వద్దకు వచ్చి మీ సమస్య ఏమిటి తల్లి అని పాప తల్లిని అడిగారు. ఆ తల్లి తన పాప రెండు సంవత్సరాల క్రిందట మెట్ల పై నుండి కిందపడి కాలర్ బోన్ విరిగిందని, పాపకు ఒకవైపు పెరుగుదల, మరోవైపు ఎదుగుదల తక్కువగా ఉండడం,తల వంకరిగా పెడుతుందని, దీనితో పాటు న్యూరో (నరాల) సమస్య కూడా ఉన్నదని పాప తల్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకొని తన సమస్యను పరిష్కరించాలంటూ కన్నీటితో కోరుకుంది . వెంటనే ముఖ్యమంత్రి స్పందించి మీ పాపకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని, పాపకు పెన్షన్ కూడా మంజూరు చేస్తానని,పాపకు గతంలో వైద్యానికి ఖర్చుపెట్టిన డబ్బులు కూడా తిరిగి ఇస్తానని, మీ పాపకు నేను భరోసా అంటూ ముఖ్యమంత్రి పాప తల్లికి భరోసా ఇచ్చారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో అన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి పాప సమస్య గురించి తెలుసుకోవాలని అధికారులకు సూచించడంతో యుద్ధ ప్రాతిపదికన అధికారులు పాప తల్లి వద్దకు వచ్చి పాపకు సంబంధించిన నిమ్స్ హాస్పటల్ రిపోర్ట్స్, తల్లి బ్యాంకు ఖాతా నెంబర్ తీసుకొని వెళ్లారు. తల్లి ఖాతాలో గతంలో ఖర్చుపెట్టిన లక్ష రూపాయలు వేశారు. పాప వైద్యానికి సంబంధించిన డాక్టర్లు స్పందించి గతంలో నిమ్స్ హాస్పటల్ రిపోర్ట్స్ కూడా అడిగి తీసుకున్నారు. తల్లి,తండ్రి మాట్లాడుతూ పాపకు వైద్యం ఎలా చెప్పించాలని దేవుడిని వేడుకుంటున సమయంలో ఆ దేవుడు ఈ రూపంలో పంపించాడని ఆ తల్లి కన్నీటితో ఆవేదన వెల్లబుచ్చింది. మాలాంటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం చేసుకోలేక బాధపడుతున్న కొన్ని వేల మందికి వైద్యం చేపించి ప్రాణం పోసిన దేవుడని ఆ తల్లి అన్నది.

Akhand Bhoomi News

error: Content is protected !!